Marriages:దీపావళి ముగిసిన వెంటనే శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు నవంబర్, డిసెంబర్ నెలల్లో శుభ ఘడియలు రానున్నాయి. ఇప్పటికే ఈ ఘడియల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాల్లో సందడి నెలకొన్నది. శుభ ముహూర్తాల ఏఏ రోజుల్లో ఉన్నాయోనని పురోహితులు సైతం సెలవిస్తూనే ఉన్నారు. ఇక ఆ ఘడియలు రానే వచ్చాయన్న మాట.
Marriages: నవంబర్ నెలలో 3వ తేదీ నుంచి డిసెంబర్ 18 వరకు పలు తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెప్తున్నారు. నవంబర్ 3, 7, 8, 9, 10, 13, 14, 15, 16, 17 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్తున్నారు. అదే విధంగా డిసెంబర్ నెలలో 5, 6, 7, 8, 9, 10, 13, 14, 15, 18 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆయా రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది వివాహాలు జరుగుతాయని అంచనా.