Ghaati: డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన ‘ఘాటీ’ సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. 2 గంటల 35 నిమిషాల నిడివితో ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో ఎమోషనల్ జర్నీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది, సెకండ్ హాఫ్‌లో థ్రిల్లింగ్ యాక్షన్‌తో అదరగొడుతుందని టాక్. క్రిష్ గత చిత్రాలైన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘వేదం’లాగే ఈ సినిమా కూడా బలమైన కథాంశంతో రూపొందినట్లు సమాచారం. అనుష్క ఈ చిత్రంలో పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుంది, ఇది ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
