బతుకమ్మ దసరా పండుగలకు సొంత ఇళ్లకు చేరుకున్న ప్రయాణికులు తిరిగి హైదరాబాద్ ముఖం పట్టడంతో ఆదివారం రాజీవ్ రహదారిపై సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్ ప్లాజా వద్ద టోల్ రుసుము వసూలు చేయడం మూలంగా మధ్యాహ్నం నుండి వారీగా వాహనాలు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ట్రాఫిక్ సుమారు మూడు కిలోమీటర్ల మేర కొనసాగడంతో దుద్దెడ టోల్ ప్లాజా నుండి కలెక్టరేట్ వరకు ఐదు లైన్లుగా కార్లు ,ఇతర వాహనాలు భారీగా వేల సంఖ్యలో ట్రాఫిక్ లో ఇరుక్కున్నాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సుమారు రెండు గంటలకు పైగా ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాహనాలకు సైతం టోల్ ప్లాజా యజమాన్యం టోల్ రుసుము వసూలు చేశారు. టోల్ ప్లాజా యాజమాన్యం ఇదే అదునుగా భారీ మొత్తంలో టోల్ రుసుమును వసూలు చేసింది. టోల్ ప్లాజా హైవే నియమాల ప్రకారం 10 నిమిషాల కంటే ఎక్కువ నిలిచిన వాహనాలకు టోల్ ప్లాజా రుసుము వసూలు చేయొద్దు అన్న నిబంధన ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా దుద్దెడ టోల్ ప్లాజా యాజమాన్యం ప్రయాణికుల నుండి ఫాస్ట్ట్యాగ్ రూపంలో నిక్కచ్చిగా టోల్ రుసుమును వసూలు చేయడం ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. ఇంత భారీ ఎత్తున దసరా సమయంలో టోల్ ప్లాజా ట్రాఫిక్ జామ్ ను నియంత్రించడానికి టోల్ ప్లాజా యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల ప్రయాణికులు అవస్థలు పట్టనట్లుగా హెచ్ కె ఆర్ హైవే యాజమాన్యం వ్యవహరించడం పట్ల ప్రజలు అవస్థలు పడడం కనిపించింది. ఈ ట్రాఫిక్ దృష్ట్యా సంబంధిత పోలీస్ శాఖ నుండి కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
