FireCrackers: దీపావళి పండుగ అంటే బాణసంచా (పటాకులు) కాల్చి ఆకాశంలో మిరుమిట్లు గొలిపి సంబురాలు జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలాంటి పెద్ద ఎత్తున పటాకులు కొనుగోలు చేస్తుంటారు. ఇళ్లలో ఇంటిల్లిపాదీ ఎవరికి తగ్గ పటాకులను వారు కాలుస్తూ ఆంనదం పంచుకుంటారు. అయితే అలాంటి పటాకులతో ఏర్పడే ప్రమాదకర ఘటనలు జరగకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు పాటించాలని పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది.
FireCrackers: ఈ మేరకు బాణసంచా తయారీ దారులు, సరఫరాదారులు, హోల్‌సేల్, రీటెయిల్ విక్రయదారులు నిబంధనలు పాటించాలని సూచించింది. వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు పోలీస్ శాఖ తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో పోలీస్ శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నాకే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. నిబంధనలు పాటించని వారిపై ఎక్స్-ప్లోజివ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.
1) సంబంధిత అధికారుల నుంచి విక్రయదారులు ముందస్తు అనుమతి తీసుకోవాలి
2) పటాకుల దుకాణాలు ఖాళీ ప్రదేశాలలోనే ఏర్పాటు చేయాలి.
3) దుకాణాల మధ్య కనీస దూరం పాటించాలి.
4) జనం రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఎలాంటి పటాకుల దుకాణాలు ఏర్పాటు చేయరాదు.
5) కేవలం గుర్తించిన ప్రదేశాల్లోనే విక్రయం చేయాలి
6) కొనుగోలు దారులు క్యూ పద్ధతి పాటించేలా విక్రయాలు జరపాలి.
7) భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి.
8) నిబంధనలను అతిక్రమించి ఎక్కువ ధరలకు అమ్మరాదు.
9) అగ్నిమాపక పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
10) విద్యుత్ లైన్ల వద్ద ఎలాంటి బాణసంచాను నిల్వ ఉంచరాదు.
11) మైనర్ల ద్వారా పటాకులను విక్రయించరాదు.