Ragging

Ragging: ర్యాగింగ్ పేరుతో చితకబాదిన తోటి విద్యార్థులు.. వీడియో వైరల్

Ragging: దేశంలో ర్యాగింగ్‌ నిర్మూలన కోసం చిన్న కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు ఎన్నో చట్టాలు, ఆదేశాలు జారీ చేసినా.. ఈ దుష్ప్రవర్తన అంతమయ్యేలా కనిపించడం లేదు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ర్యాగింగ్‌ అనే భూతం ఇప్పటికీ అక్కడక్కడా విద్యార్థుల ప్రాణాలను హరిస్తూనే ఉంది. తాజాగా తిరుపతి జిల్లా పుత్తూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ హాస్టల్‌లో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.

హాస్టల్ గదిలో విద్యార్థిపై దాడి

వివరాల్లోకి వెళితే, పుత్తూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థిపై ఐదుగురు తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేశారు. వ్యక్తిగత విభేదాలు, ఒక యువతి కారణంగా ఏర్పడిన గొడవ ఈ స్థాయికి దారితీసింది. విద్యార్థిని హాస్టల్ గదిలోకి లాగి, కాళ్లతో తన్ని, విచక్షణారహితంగా చితకబాదారు. బాధిత విద్యార్థి బతిమాలినా.. వారు ఆగకపోవడం గమనార్హం. ఈ ర్యాగింగ్ మొత్తని ఇంకో విద్యార్థి వీడియో తీయగా. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి: TVK Vijay Rally Stampede: కరూర్ ర్యాలీ తొక్కిసలాటపై చిరంజీవి స్పందన..

పోలీసులు కేసు నమోదు – కాలేజీ కఠిన చర్యలు

ఈ సంఘటనపై కళాశాల యాజమాన్యం స్పందించి, దాడిలో పాల్గొన్న విద్యార్థులపై తక్షణమే చర్యలు తీసుకుంది. కడపకు చెందిన ఆరుగురు పాలిటెక్నిక్ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ, వారిపై నారాయణవనం పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, గొడవకు కారణమైన యువతికి కూడా కళాశాల టీసీ ఇచ్చి పంపించింది.

ర్యాగింగ్‌ నిరోధానికి కఠిన చర్యలే మార్గం

ఇటీవల కాలంలో ర్యాగింగ్‌ ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో ఉప్పల్‌ మేడిపల్లి ప్రాంతంలోని ఓ కాలేజీలో ర్యాగింగ్‌కు గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంకా మరవక ముందే.. తిరుపతిలో మరో ఘటన వెలుగుచూడటం తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతోంది. ర్యాగింగ్‌ బాధలతో ఇప్పటికే ఎన్నో నిర్దోషి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, సమాజం మొత్తం ఈ ర్యాగింగ్ అనే భూతాన్ని నిర్మూలించడానికి మరింత కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ తరహా ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *