Farhans Gun Firing Celebration: ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ తన హాఫ్ సెంచరీని వివాదాస్పదంగా సెలబ్రేట్ చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత, ఫర్హాన్ తన బ్యాట్‌ను ఏకే-47 రైఫిల్లా పట్టుకుని కాల్చినట్లుగా సంజ్ఞ చేశాడు.
ఈ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. చాలా మంది భారత అభిమానులు దీనిపై “సిగ్గుచేటు… అవమానకరం” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఇది రాజకీయ ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న రెండు దేశాల మధ్య ఇలాంటి సంజ్ఞ చేయడం సరికాదని పేర్కొన్నారు. క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమేనని, ఇలాంటి సంజ్ఞలతో దాన్ని దిగజార్చకూడదని అన్నారు. కొందరు ఇది ఐసీసీ నియమావళిని ఉల్లంఘించడమేనని కూడా అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: IND vs PAK: పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించిన అభిషేక్!6 వికెట్ల తేడాతో భారత్ విజయం
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. భారత అభిమానులతో పాటు, కొంతమంది క్రికెట్ విశ్లేషకులు కూడా ఫర్హాన్ చర్యను తప్పుబట్టారు. గతంలో కూడా పాకిస్తాన్ క్రికెటర్లు వివాదాస్పద సంజ్ఞలు, చర్యలతో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ సంఘటన కూడా వాటిలో ఒకటిగా నిలిచిపోయింది. దీనిపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
ఇక ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌పై మరోసారి ఘన విజయం సాధించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన పోరులో భారత్ ఆరు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.
In a terrorist like action Pakistani player Sahibzada Farhan celebrated scoring a fifty against India in Asia cup by mimicking an AK-47 gun action with his bat towards crowd.
Reportedly there have been two verbal clashes between Pakistani players and Indian players. pic.twitter.com/rWMJHoZRyU
— भरत 🇮🇳 (@mata_bhakta) September 22, 2025