Fake Doctors: గుజరాత్లోని సూరత్ నగరంలోని పండేసర ప్రాంతంలో నకిలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కలకలం సృష్టిస్తోంది. శిథిలావస్థకు చేరిన ఒక థియేటర్ లో ఈ నకిలీ హాస్పటల్ నడుస్తున్నట్టు గుర్తించారు. ఈ ఆసుపత్రిలో ఉన్న ముగ్గురు డాక్టర్ల సర్టిఫికెట్లు కూడా నకిలీవే అని తేలింది. అంతేకాకుండా ఈ ఆసుపత్రి విషయంలో తవ్వే కొద్దీ షాకింగ్ విషయాలు బయట పడ్డాయి. ఇక్కడి డాక్టర్స్ లో ఒక డాక్టర్ సూరత్, నవ్ శారీలో అక్రమ మద్యం అమ్మినందుకు గతంలో అరెస్ట్ అయినట్టు తేలింది. అంతేకాదు.. మరో ఇద్దరు డాక్టర్లు గతంలో నకిలీ సర్టిఫికెట్లతో ప్రాక్ట్స్ చేస్తున్నందుకు ఐదేళ్ల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తులు కావడం కూడా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ హాస్పిటల్ వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది.

