Esha-Sajid: బాలీవుడ్ నటి ఈషా గుప్తా, దర్శకుడు సాజీద్ ఖాన్ మధ్య జరిగిన పాత వివాదం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. 2014లో ‘హమ్‌షకల్స్’ సినిమా సెట్లో ఈ ఘటన చోటు చేసుకుందని ఆమె ఇటీవల స్పష్టం చేశారు. సాజీద్ ఖాన్ తనను అవమానించి, అవమానకరంగా ప్రవర్తించినట్లు ఈషా వెల్లడించారు. “అతను నన్ను దూషించాడు, నేను కూడా బదులు ఇచ్చాను. సెట్‌ను వదిలి ఇంటికి వెళ్లిపోయాను” అని ఆమె చెప్పారు. ఈ ఘటనతో ఆమె సినిమా నుంచి బయటపడేందుకు ఆలోచించినా, నిర్మాత చెప్పడంతో మళ్లీ చేరారట.
Also Read: Rashmika Mandanna: రష్మిక మందన్న సంచలన సోలో ప్రయాణం మొదలు!
Esha-Sajid: సాజీద్ కూడా క్షమాపణ కోరినా, ఈషా దాన్ని అంగీకరించలేదని తెలిపారు. MeToo ఉద్యమంలో సాజీద్‌పై అనేక ఆరోపణలు వచ్చినా, ఈషా ఆయనపై ఆ రకమైన ఆరోపణలు చేయలేదని స్పష్టం చేశారు. ఈ సంఘటన ఆమె కెరీర్‌పై ప్రభావం చూపిందని, అయినా ఆమె ధైర్యంగా ముందుకు సాగినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వివాదం మళ్లీ ఆవిర్భవించడంతో బాలీవుడ్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.