Esha Gupta: క్రికెటర్ హార్దిక్ పాండ్యతో డేటింగ్ రూమర్స్‌పై నటి ఈషా గుప్తా తాజాగా స్పందించింది. గతంలో వీరిద్దరి మధ్య సంబంధం ఉందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈషా తన వెర్షన్‌ను స్పష్టం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. “మేము కొన్ని నెలల పాటు సంభాషించాము. ఈ క్రమంలో మా మధ్య స్నేహబంధం ఏర్పడింది. అయితే, మేము డేటింగ్‌లో ఉన్నామని ఎప్పుడూ భావించలేదు. మాటలు మొదలైన సమయంలో భవిష్యత్తులో సంబంధం ఏర్పడొచ్చు లేదా ఉండకపోవచ్చని అనుకున్నాం. కానీ, రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టకముందే మా సంబంధం ముగిసింది. రెండు లేదా మూడు సార్లు మాత్రమే కలిసి ఉంటాం. కొన్ని నెలలు మాట్లాడుకున్న తర్వాత ఆ బంధం సహజంగా ముగిసిపోయింది” అని ఈషా వివరించింది.
ఈ వ్యాఖ్యలతో హార్దిక్‌తో తన లింక్‌పై వచ్చిన ఊహాగానాలకు ఈషా పుల్‌స్టాప్ పెట్టింది. స్వల్పకాల స్నేహబంధంగా మాత్రమే తమ సంబంధాన్ని ఆమె అభివర్ణించింది.

