Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా స్పందించిన మస్క్, వాన్స్ తన పదవిలో అత్యుత్తమంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో అతను అమెరికా అధ్యక్షుడవుతాడని అభిప్రాయపడ్డారు.
ఓ పోస్ట్‌కు స్పందిస్తూ “జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా అద్భుతంగా పని చేస్తున్నారు. భవిష్యత్తులో ఆయన అమెరికా అధ్యక్షుడు అవుతారు.” అని మస్క్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: Russia: ‘గట్టిగా చెంపదెబ్బ కొట్టారు…’ ట్రంప్-జెలెన్ స్కీ పోరును రష్యా ఎగతాళి చేసింది
Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయంలో మస్క్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రభుత్వ వ్యవస్థలను సమర్థవంతంగా మార్చేందుకు మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) పలు కీలక విధానాలు తీసుకొచ్చింది. తాజాగా, భవిష్యత్తులో అమెరికా నాయకత్వంపై మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి.