Hyderabad: హైదరాబాద్‌లోని పంజాగుట్టలో శనివారం మధ్యాహ్నం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాన్‌బాగ్ హోటల్ ఐదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో హోటల్‌లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం.
అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా? ప్రాణనష్టం జరిగిందా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. మంటలు ఎందుకు చెలరేగాయి? దానికి గల కారణాలేంటో తెలియాల్సి ఉంది.
ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముంది.