Dulquer Salmaan: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవలే “లక్కీ భాస్కర్” సినిమాతో పెద్ద హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్ సల్మాన్, ఆదివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన్ను కలిశారు. ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగింది.
“మహానటి”, “సీతారామం” వంటి విజయవంతమైన సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్, ఈ సమావేశానికి సినీ నిర్మాత స్వప్న దత్‌తో పాటు మరికొందరు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుల్కర్ సల్మాన్‌ను శాలువాతో సత్కరించారు.
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ “కాంత” అనే కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఇది 1950ల నాటి మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి నిర్మిస్తున్నారు.