Dr Rajagopala Chidambaram: ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం(88) ఈరోజు (జనవరి 04) ముంబైలో కన్నుమూశారు.
రాజగోపాల చిదంబరం (88) ప్రసిద్ధ అణు శాస్త్రవేత్త 1975-1998లో భారతదేశం అణ్వాయుధ పరీక్షలలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అతను డిసెంబర్ 11, 1936 న చెన్నైలో జన్మించాడు. స్టేట్ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి పిహెచ్‌డి పూర్తి చేసిన తర్వాత, అతను 1962లో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో చేరాడు.
అతను 1975-1998 లో భారతదేశం అణ్వాయుధ పరీక్షలలో కీలక పాత్ర పోషించాడు. 1975లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అబ్దుల్ కలాం తర్వాత ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ పదవిని వ్వక్తి ఆయనే. ఆయన 17 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. 1999లో పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు.
ఇది కూడా చదవండి: Indian Army In Extreme Snowfall: ఇది కదా ఆర్మీ అంటే.. దీనికి కదా మనం సెల్యూట్ చేయాల్సింది..
అతను అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్‌గా భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌గా పనిచేశాడు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.
అనారోగ్య కారణాలతో ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో చేరిన చిదంబరం ఈరోజు (జనవరి 04) తెల్లవారుజామున 3.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి వివిధ పార్టీలు సంతాపం తెలిపాయి.
భారతదేశానికి సూపర్ కంప్యూటర్ల స్వదేశీ అభివృద్ధిలో చిదంబరం కీలకపాత్ర పోషించారు. భారతదేశం అణ్వాయుధ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో అతని పాత్ర అపారమైనది. ఆయన సహకారం వల్లే భారత్ అంతర్జాతీయ స్థాయిలో అణుశక్తిగా అవతరించింది’’ అని ఆయన నాయకత్వంలో పనిచేసిన అధికారులు కొనియాడారు.