Game Changer: రామ్ చరణ్ – శంకర్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనే విడుదల చేయాలని నిర్మాతలు దిల్ రాజు, శిరిష్ మొదట భావించారు. అయితే ఇప్పుడు వీరు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోనూ ఈ సినిమా తెలుగు, తమిళ వర్షన్స్ రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఆ ప్రకారంగా ప్రచారం మొదలు పెట్టారు. తమ రాష్ట్రంలో పరాయి భాషా చిత్రాన్ని ప్రదర్శించడం ఏమిటంటూ కన్నడిగులు నిరసనకు దిగారు. కొన్ని చోట్ల ‘గేమ్ ఛేంజర్’ మూవీ పోస్టర్స్ ను కూడా చించివేసినట్టు తెలుస్తోంది. దాంతో ఈ వివాదం ఇంకా ముందరకముందే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని దిల్ రాజు భావించినట్టు ఉన్నారు. హుటాహుటిన తాజాగా విడుదలైన ట్రైలర్ ను కన్నడలోకి డబ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక్కసారి కన్నడ ట్రైలర్ విడుదల చేశారంటే… దాని అర్థం సినిమా కూడా కన్నడలో వస్తుందనే! అన్నట్టు కన్నడ వర్షన్ ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనూ మలయాళ వర్షన్ ట్రైలర్ నూ రిలీజ్ చేశారు. సో… ఇప్పుడీ త్రిభాషా చిత్రం మొత్తం ఐదు భాషల్లో విడుదల కాబోతోంది.