Indian Army In Extreme Snowfall: గడ్డ కట్టే చలి.. ఉడికిపోయేంత ఎండ.. మునిగిపోయేలా నీరు.. ఇలా ఎక్కడైనా.. ఎప్పుడైనా.. రెడీగా ఉండే ఒకే ఒక్క వ్యవస్థ మన ఆర్మీ. మన సైనికులు.. మన దేశానికి దేవుళ్లు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, విధి నిర్వహణలో వాళ్ళు ఎదుర్కొని సవాళ్ళుండవు. అవతల నుంచి వచ్చి పడుతున్న ముష్కరులు.. పై నుంచి ఆగకుండా కురుస్తున్న మంచు.. అడుగు తీసి అడుగు వేయడమే కష్టం అనేంతగా ఉన్న కొండలు.. కాలు పెడితే నడుములోతు వరకూ మంచు గడ్డలో మునిగిపోతున్న పరిస్థితి. అయినా సరే.. మనల్ని.. మన దేశాన్ని కాపాడాలనే దృఢ సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తున్న సైనికులకు కదా మనం చెయ్యాలి సెల్యూట్! జమ్మూ కాశ్మీర్ బోర్డర్.. అంటేనే నిరంతరంగా మన దేశంలోకి దూసుకు రావడానికి ప్రయత్నించే పాకిస్థాన్ ఉగ్రవాదుల స్థలం. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. మన దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద అంటే ఎల్వోసీ దగ్గర పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉంటాయి. విపరీతమైన మంచు కురిసి.. దారులు.. ఇళ్ళు.. కొండలు అన్నీ మంచుతో కప్పబడిపోతాయి. ఈ సమయం కోసం పాకిస్థాన్ నుంచి మనవైపు రావడం కోసం ముష్కరులు ప్రయత్నాలు చేస్తారు. అందుకే మన ఆర్మీ చాలా అప్రమత్తంగా కావలి కాస్తుంటుంది. కానీ, అక్కడ పరిస్థితులు చూస్తేనే మన గుండె ఆగిపోతుంది. అవును.
ఇది కూడా చదవండి: RBI JE Recruitment 2025: డిప్లొమా పూర్తి చేశారా.. ఐతే RBIలో జూనియర్ ఇంజనీర్ పోస్ట్ కి అప్లై చేయండి
Indian Army In Extreme Snowfall: శీతాకాలంలో ఎల్వోసీ దగ్గర అడుగు తీసి అడుగు వేయడమే కష్టం అన్నంతగా మంచు పేరుకుపోతుంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మన సైనికులకు సెల్యూట్ చేయాల్సిందే. వారి ధైర్యం.. త్యాగం వలెనే మనం ఇక్కడ రకరకాల రాజకీయాలు.. వినోద విన్యాసాలు చేయగలుగుతున్నాం. అక్కడ ఆ సైనికులు ఏ మాత్రం ఒక్క గంట మనకెందుకులే అని వదిలేస్తే.. తరువాత మన పరిస్థితి ఊహించుకోండి.
ఇదిగో ప్రస్తుతం కఠినమైన వాతావరణంలో ప్రాణాల్ని పణంగా పెట్టి మనకోసం విధులు నిర్వర్తిస్తున్న వీరుల ఫోటో చూడండి.. కచ్చితంగా ఆర్మీ అంటే ఇదిరా అని అంటారు. అవును ఆర్మీ అంటే ఇదే.. సైన్యం అంటే వీరే..
#WATCH | As we welcome the New Year, it’s important to take a moment to reflect on the incredible sacrifices made by our soldiers, especially those guarding the Line of Control (LoC) in Jammu & Kashmir. The Indian Army, despite facing extreme weather conditions — from searing… pic.twitter.com/dcYqKQb18m
— ANI (@ANI) January 1, 2025