Vidaamuyarchi: తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో మంచి విజయాలను సాధించి, అలవోకగా వెయ్యి కోట్ల క్లబ్ లో చోటు సంపాదించుకున్నాయి. కానీ కోలీవుడ్ నుండి వెళ్ళిన పాన్ ఇండియా సినిమాలు ఆ మార్క్ ను టచ్ చేయలేకపోయాయి. ఆ లోటును తీర్చడానికి ఇప్పుడు అజిత్ హీరోగా దేసింగ్ పెరియసామి ఓ ప్రయత్నం చేయబోతున్నాడు. ‘బాహుబలి’ తరహాలో ఓ పిరియడ్ డ్రామాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ‘కనులు కనులను దోచాయంటే’ మూవీతో దర్శకుడిగా మారిన దేసింగ్ పెరియసామి… ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ గా పేరు తెచ్చుకున్నాడు. అందుకే అజిత్ అతనికి ఓ అవకాశం ఇవ్వాలని అనుకున్నాడట. అయితే ఇటీవల ‘కంగువ, తంగలాన్’ సినిమాలను కోలీవుడ్ దర్శకులు తీశారు కానీ అవి జాతీయ స్థాయిలో మెప్పించలేకపోయాయి. మరి ఇప్పుడు అజిత్ మూవీ అయినా ఆ లక్ష్యాన్ని చేరుతుందేమో చూడాలి.