Bananas

Bananas: అరటిపండ్లు త్వరగా పాడవుతున్నాయా? అయితే ఈ టిప్స్ తెలుసుకోండి.!

Bananas: అరటిపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే ఈ పండ్లు ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే వీటి ప్రధాన సమస్య ఏమిటంటే — త్వరగా పాడైపోవడం. మార్కెట్‌ నుండి తెచ్చిన కొద్ది రోజుల్లోనే మచ్చలు ఏర్పడి నల్లగా మారిపోతాయి. కానీ కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే అరటిపండ్లు రెండు వారాల వరకు తాజాగా నిల్వ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండే చిట్కాలు:
మొదట మార్కెట్‌ నుండి తెచ్చిన వెంటనే పండ్లను ప్లాస్టిక్‌ కవర్‌ నుంచి వేరు చేయాలి. అన్ని పండ్లను ఒకే చోట ఉంచడం వల్ల ఒకటి చెడిపోతే మిగిలినవీ త్వరగా పాడవుతాయి. కాబట్టి పండ్లను ఒక్కొక్కటిగా విడదీయాలి.

అరటిపండ్ల కాడను సిల్వర్‌ ఫాయిల్‌ లేదా ప్లాస్టిక్‌ ర్యాప్‌తో చుట్టి రబ్బర్‌ బ్యాండ్‌తో కట్టాలి. దీని వల్ల కాడ నుంచి ఇథిలీన్‌ వాయువు విడుదల కావడం తగ్గి పండ్లు త్వరగా పండిపోవు.

అరటిపండ్లు వేడి లేదా ఎండ తగిలే చోట ఉంచకూడదు. బదులుగా చల్లని గది ఉష్ణోగ్రతలో లేదా గాలి బాగా తగిలే ప్రదేశంలో ఉంచితే పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

Also Read: Saffron Milk: కుంకుమపువ్వు పాలు: ఆరోగ్యం, అందం కోసం సూపర్ ఫుడ్!

అరటిపండ్లను బుట్టలో ఒకదానిపై ఒకటి ఉంచకండి. వాటిని తాడుపై వేలాడదీస్తే గాలి సరిగా తగిలి పండ్లు తాజాగా ఉంటాయి. ఇదే పద్ధతిని మార్కెట్లో వ్యాపారులు కూడా అనుసరిస్తారు. అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచితే అవి త్వరగా నల్లగా మారతాయి. చల్లని గాలితో తొక్క కఠినమై రుచి తగ్గుతుంది.

అరటిపండ్లను యాపిల్‌, అవకాడో, టమాటా వంటి పండ్ల దగ్గర ఉంచకండి. వీటి నుంచి వచ్చే ఇథిలీన్‌ వాయువు అరటిపండ్లను వేగంగా పాడయ్యేలా చేస్తుంది. ఒక పండు చెడిపోతే వెంటనే వేరుచేయాలి. లేకపోతే మిగిలినవి కూడా త్వరగా పాడిపోతాయి.
అరటిపండ్లు — విటమిన్‌ బి6, పొటాషియం, ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె, జీర్ణవ్యవస్థ, కిడ్నీలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవితానికి అరటిపండ్లను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవాలి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *