Breast Cancer: చాలామంది మహిళలు బ్రాతో నిద్రపోతారు. నిద్రపోయేటప్పుడు బ్రా వేసుకోవాలా వద్దా? అని కొంతమది తికమక పడతారు. మరికొంతమంది మహిళలు బ్రాతో పడుకోవడానికి అసౌకర్యంగా ఫీల్ అవుతారు. అయితే నిద్రపోతున్నప్పుడు బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి బ్రా వేసుకుని నిద్రపోవద్దని సూచిస్తున్నారు.
Breast Cancer: బ్రా వేసుకుని పడుకోవడం వల్ల పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంది. చర్మ సౌందర్యాన్ని ప్రభావితం చేసే వివిధ సమస్యలలో పిగ్మెంటేషన్ ఒకటి. నిద్రపోయేటప్పుడు బ్రా ధరించడం వల్ల పిగ్మెంటేషన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయట. రాత్రి నిద్రిస్తున్నప్పుడు బిగుతుగా ఉండే బ్రా ధరించడం వల్ల అసౌకర్యంగా ఫీల్ అవడంతో పాటు నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. మంచి నిద్ర లేకుంటే మొత్తం ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.
ఇది కూడా చదవండి: YCP Party: వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్
Breast Cancer: అంతేకాకుండా బిగుతుగా ఉండే బ్రా వల్ల అలర్జీలు, చర్మ సమస్యలు వస్తాయి. రాత్రిపూట బ్రా ధరించడం వల్ల రక్తప్రసరణ తగ్గుతుంది. దీని వల్ల స్తనాలలోని నరాలు లాగినట్లుగా అనిపించవచ్చు. బ్రా ఎంత బిగుతుగా ఉంటే అంత మంచిదని చాలామంది మహిళలు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బిగుతుగా ఉండే బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కాబట్టి నైట్ టైమ్ బ్రా వేసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిది.