DK Aruna: సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయంపై రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతూనే ఉన్నాయి. సినీ నటుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో పోరాడుతున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, విడుదల అనంతర పరిణామాలపై రాజకీయ రగడ మాత్రం కొనసాగుతూనే ఉన్నది. ఈ విషయంలో బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ, ఆ పార్టీ కీలక నేతల డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
DK Aruna: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన బాధాకరమని ఎంపీ డీకే అరుణపేర్కొన్నారు. అయితే ఈ సంధ్య థియేటర్ ఘటనను సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయం చేసి వాడుకుంటున్నారని, ఇది సరికాదని చెప్పారు. అల్లు అర్జున్ కూడా ఈ ఘటన జరగాలని కోరుకోరని తెలిపారు. అయితే అల్లు అర్జున్‌ను ప్రభుత్వం బలిచేయాలని చూడటం సరికాదని చెప్పారు.

