Barroz 3D: మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ తొలిసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకుని తెరకెక్కించిన సినిమా ‘బరోజ్’. దీనిని నిర్మాత ఆంటోని పెరుంబవూర్ గ్రాండ్ గా నిర్మించారు. ఈ ఎపిక్ డ్రామా ఫాంటసీ సినిమాలో టైటిల్ రోల్ ను మోహన్ లాలే పోషించారు. ఇంతవరకూ మలయాళంలో కేవలం మూడే త్రీ డీ సినిమాలు వచ్చాయని, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని వాడుకుని దీనిని త్రీడీ లో అద్భుతంగా తెరకెక్కించామని మోహన్ లాల్ చెప్పారు. విజువల్ వండర్ తో పాటు స్టోరీ టెల్లింగ్ ని రీ-డిస్కవర్ చేసేలా ఇది ఉంటుందని అన్నారు. గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 25న రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పంపిణీ చేయడం పట్ల మోహన్ లాల్ హర్షం వ్యక్తం చేశారు. 12 సంవత్సరాల లిడియన్ నాదస్వరం ఈ మూవీకి సాంగ్స్ కంపోజ్ చేయడం విశేషమని మోహన్ లాల్ అన్నారు.