Dil Ruba: ‘క’ వంటి హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా ‘దిల్ రూబా’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన ‘దిల్ రూబా’ టీజర్ కు మంచి స్పందన లభించింది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి మార్చి 14న రిలీజ్ కానుంది.
రుక్సాన్ తిల్లాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సినిమా పట్ల చిత్ర హీరో కిరణ్ అబ్బవరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే కిరణ్ అబ్బవరం మరియు అతని స్నేహితులు, కొందరు సన్నితులతో కలిసి ప్రసాద్ ల్యాబ్ లో సినిమా చూసుకున్నారు.
Also Read: Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాస్ట్లీ వాచ్ వైరల్..!
అనంతరం దిల్ రూబాను అనుకున్న డేట్ కంటే ఒకరోజు ముందుగా అనగా 13 రాత్రి ప్రీమియర్స్ వేసేందుకు రెడీ అయ్యాడు. అప్పట్లో ‘క’ కి కూడా ముందే ప్రీమియర్స్ వేసాడు కిరణ్. విశ్వ కరుణ్ ‘దిల్ రూబా’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ఏ యూడ్లీ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.