Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పలు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో అయాన్ ముఖర్జీతో బాలీవుడ్ లో చేస్తున్న చిత్రం వార్ 2 కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ లో ఎప్పటికప్పుడు పాల్గొంటున్న తారక్ లేటెస్ట్ గా మరోసారి ఆ సినిమా లుక్ లో కనిపించాడు. తాజాగా తారక్ లుక్ ఒకటి బయటకి రాగా దానితో పాటుగా తన చేతికి పెట్టుకున్న వాచ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.అయితే ఈ వాచ్ ఏకంగా 7 కోట్లకి పైగా ఖరీదు చేస్తుందని తెలుస్తుంది. ఇది వరల్డ్ ఫేమస్ లగ్జరీ వాచ్ కంపెనీ అయిన రిచర్డ్ మిల్లీ ఆర్ఎం 40-01 టర్బిలోన్ ఎడిషన్ గా తెలుస్తుంది. ప్రస్తుతం తారక్ వాచ్ గురించి సోషల్ మీడియాలో అభిమానులు సహా బాలీవుడ్ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నాయి.
View this post on Instagram