Samantha-Naga Chaitanya

Samantha-Naga Chaitanya: నాగ చైతన్య సమంతకు 200 కోట్లు భరణంగా ఇచ్చాడా?

Samantha-Naga Chaitanya: దక్షిణ భారత చిత్ర పరిశ్రమలోనే కాకుండా డిమాండ్ ఉన్న నటి సమంత. చెన్నైకి చెందిన సమంత తెలుగు నటుడు నాగ చైతన్యను ప్రేమించి 2017లో వివాహం చేసుకుంది. నాలుగు సంవత్సరాలు తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకుని 2021లో విడిపోయారు. దీని తర్వాత, నాగ చైతన్య నటి శోబిత ధూళిపాల్‌ను వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా, సమంత ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంతకు 200 కోట్ల వరకు భరణం అందినట్లు వార్తలు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్ ఈ ప్రశ్నను లేవనెత్తారు.

ఇది కూడా చదవండి: Kannappa: మంచు విష్ణు కార్యాలయాల్లో జీఎస్టీ అధికారుల సోదాలు

నటి సమంత నవ్వుతూ స్పందిస్తూ నిజం చెప్పాలంటే, నాకు ఎవరి నుండి ఒక్క రూపాయి కూడా రాలేదు” అని ఆమె స్పష్టం చేసింది. చాలా మంది సెలబ్రిటీలు తమ విడాకుల సమయంలో భరణం తీసుకుంటుండగా, సమంత ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, అందరికీ ఆదర్శంగా నిలిచింది. విడాకుల తర్వాత సమంత లైఫ్‌ తలక్రిందులైంది. ఆమెని మయోసైటిస్‌ వ్యాధి వెంటాడింది. దానితో ఏడాదికిపైగానే పోరాడింది. దాన్నుంచి బయటపడి మళ్లీ సినిమాలు చేయాలనుకునే సమయంలోనే ఇటీవల తండ్రి చనిపోయారు. ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతుంది. కాగా సమంత ప్రస్తుతం రాజ్ తో డేటింగ్ చేస్తోందని.. ఈ జంట లివిన్ లో కలిసి జీవిస్తారని కూడా పుకార్లు షికార్లు కొట్టాయి. సమంత శుభం సినిమాతో నిర్మాతగా తెరకెక్కించిన తొలి చిత్రం విజయవంతం అయింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *