Devaragattu Karra Samaram: దేవరగట్టు కర్రల సమరంలో విషాదం నెలకొన్నది. ఏటా జరిగినట్టుగా కర్రల లేచాయి. సుమారు 2 లక్షల మంది పాల్గొన్న ఈ వేడుకల్లో వందలాది మంది కర్రల సమరంలో పాల్గొన్నారు. ఈ కర్రల సమరంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. సుమారు 100 మందికి పైగా గాయాలై రక్తాలు కారుతున్నాయి. కర్నూలు జిల్లా దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి బన్సీ జైత్రయాత్రలో ఈ విషాదం చోటుచేసుకున్నది.
Devaragattu Karra Samaram: విజయదశమి రాత్రి (అక్టోబర్ 2) దేవరగట్టులో పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. అమ్మవారిని తీసుకెళ్లే సమయంలో ఈ కర్రల సమరం జరుగుతుంది. నిన్న పూజలతో ప్రారంభమైన ఈ సమరం.. కర్రలతో మోసకట్టుకునే రీతిలో సాగింది. ఈ వేడుకను తలకించేందుకు సుమారు 2 లక్షల మంది వచ్చినట్టు సమాచారం. ఈ కర్రల సమరంలో పాల్గొన్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు.
Devaragattu Karra Samaram: ఏటా మాదిరిగానే ఈ సారి కూడా దేవరగట్టు కొండ పరిసర ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు జరిగాయి. పోలీసు శాఖ భద్రతను కట్టుదిట్టట్టం చేసింది. 100కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, 700 భారీ ఎల్ఈడీ లైట్లు, 10 డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. సుమారు 1000 మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.
దేవరగట్టుకు వచ్చే వారిని తనిఖీలు చేసేందుకు కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచారు. దేవరగట్టు కర్రల సమరంలో మృతులు తిమ్మప్ప, బసవరాజుగా గుర్తించారు. ఈ సందర్భంగా గాయాలపాలైన క్షతగాత్రులను ఆలూరు, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు అందిస్తున్నారు.