రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగరేణి కార్మికులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటుచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ అని తెలిపారు. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయని సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
ప్రజాభవన్‌లో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ప్రకటిస్తున్నాన్నారు. సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్‌గా ప్రకటించామన్నారు.
ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు బోనస్ వస్తుందని తెలిపారు. సింగరేణిలో శాశ్వత ఉద్యోగులు 41,837 మంది ఉన్నారని అన్నారు. సింగరేణిలో ఒప్పంద ఉద్యోగులకు కూడా బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.