Delhi Stampede:దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. 13వ, 14వ ఫ్లాట్‌ఫామ్‌ల వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది. ఈ ఘటనలో సుమారు 15 నుంచి 20 వరకు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.
గజిబిజి ఎనౌన్స్‌మెంట్ కారణం
Delhi Stampede:అసలు తొక్కిసలాటకు కారణం ఇదేనని ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. రైళ్ల సమాచారాన్ని తెలిపే గజిబిజి ఎనౌన్స్‌మెంటే కారణమని తెలుస్తున్నది. 12వ ప్లాట్‌ఫామ్ నుంచి 16వ ప్లాట్‌ఫామ్ కు రైలు వస్తుందని అకస్మాత్తుగా ప్రకటించడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నదని సమాచారం. రైళ్ల ఆలస్యం, రద్దు వదంతులతోనూ తోపలాట జరిగినట్టు వార్త వస్తున్నాయి.
Delhi Stampede:రైల్వేశాఖ నిర్లక్ష్యంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వస్తున్నాయి. మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తజనంతో ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జనం కిక్కిరిసిపోగా ఈ తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఇదిలా ఉండగా తొక్కిసలాట మృతులంతా బీహార్, ఢిల్లీవాసులుగా గుర్తించారు.
తొక్కిసలాటలో మృతులు వీరే
Delhi Stampede:ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటలో ఆహాదేవి, పింకీదేవి, షీలాదేవి, వ్యోమ్, పూనమ్ దేవి, లతితా దేవి, సురుచి, కృష్ణదేవి, విజయ్, నీరజ్, శాంతిదేవి, పూజాకుమార్, పూనమ్, సంగీతా మాలిక్, మమతా ఝూ, రియాసింగ్, బేబీకుమారి, మనోజ్ మృతిచెందినట్టు గుర్తించారు.
Delhi Stampede:ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. రద్దీని నియంత్రించడంలో రైల్వేశాఖ విఫలమైందని విమర్‌శించారు. ప్రయాగరాజ్‌కు వెళ్లే ప్రయాణికుల కోసం మెరుగైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో క్షతగాత్రులైన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఎందరు మృతులు, క్షతగాత్రులు ఎంతమంది అనే వివరాలను వెంటనే వెల్లడించాలని ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.