Delhi CM: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు కల్పించిన జడ్ క్యాటగిరీ సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి నుంచి ఢిల్లీ రాష్ట్ర పోలీసులే ఆమెకు సెక్యూరిటీ కల్పించనున్నారు. ఇటీవల ఢిల్లీ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేఖా గుప్తాపై ఓ వ్యక్తి భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఆమె భద్రత కోసం కేంద్రప్రభుత్వం జడ్ క్యాటగిరీ సెక్యూరిటీని కల్పించాలని కేంద్రం హోంశాఖ సీఆర్ఎఫ్ ను ఆదేశించింది.
Delhi CM: ఇటీవల సీఎం రేఖా గుప్తా జన్‌సున్‌వాయి కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆమెపై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఓ ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన సుఖ్రియా రాజేశ్ భాయ్ ఖిమ్జీ ఆటో డ్రైవర్ అని పోలీసులు నిర్ధారించారు.
Delhi CM: సీఎం రేఖాగుప్తాపై దాడి ఘటనతో పోలీసుల, సీఎం నివాసంలో భద్రతా లోపాలను గుర్తించారు. ఈ లోపాల కారణంగా పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నదన్న నేపథ్యంలో జడ్ క్యాటగిరీ భద్రతను కల్పించారు. ఇలాంటి మళ్లీ జరగకుండా సరైన భద్రతా చర్యలు చేపట్టాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.