Delhi Assembly Elections 2025: చాలా రోజుల ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ ఢిల్లీ సీఎంగా అభ్యర్థిని ఖరారు చేసినట్టు తెలుస్తున్నది. ఇదే రోజు ప్రకటించే చాన్స్ ఉన్నది. ఇద్దరు పేర్లలో ఒకరి వైపు బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపినట్టు జాతీయ మీడియా కథనాలు కూడా రుజువు చేస్తున్నాయి. తొలి నుంచి పర్వేశ్ వర్మ పేరు తెరపైకి రాగా, మరికొందరు కూడా పోటీకి సై అంటూ ముందుకొచ్చారు. ఈ దశలో అన్ని కీలకాంశాలను పరిశీలించిన అధిష్ఠానం మహిళకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రేఖా గుప్తా పేరు ఫైనల్ అయినట్టు తెలిసింది.
Delhi Assembly Elections 2025: ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాకు ముఖ్యమంత్రిగా అవకాశం దక్కుతుందని తాజాగా జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంతకాలం సాగతీస్తూ వచ్చిన బీజేపీ.. ఆ అంశానికి తెరదించినట్టు తెలుస్తున్నది.
Delhi Assembly Elections 2025: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా మహిళా ముఖ్యమంత్రులు లేరు. ఆ కొరతను తీర్చేందుకే ఢిల్లీ పీఠంపై మహిళను సీఎం సీటులో కూర్చొబెట్టాలని భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇవాళ అధికారికంగా రేఖా గుప్తా పేరును బీజేపీ అధిష్టానం పెద్దలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఒకవేళ చివరి దశలో మార్పు జరిగితే పర్వేశ్ వర్మను ఫైనల్ చేసే అవకాశమూ లేకపోలేదని భావిస్తున్నారు.
20న సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవం
Delhi Assembly Elections 2025: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఫిబ్రవరి 20న ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ అగ్రనేతలు అందరూ పాల్గొననున్నారు.
Delhi Assembly Elections 2025: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు సహా పలువురు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా హై సెక్యూరిటీ గల నాయకులు హాజరవుతారని అంచనా.