USA: టెక్సాస్‌లోని డల్లాస్‌లో విశాఖపట్నం సౌత్‌కు చెందిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ తో ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. డల్లాస్ జనసైన్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే వంశీకృష్ణ కు ఆత్మీయ స్వాగతం పలికారు జనసైనికులు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలపై జన సైనికులతో వంశీకృష్ణ మాట్లాడారు.
ఈ సందర్బంగా వారి నుంచి వచ్చిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. అమరావతి రాజధానిగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందని ఆయన వెల్లడించారు. తిరుపతిని ఎలక్ట్రానిక్ హాబ్ గా తిర్చిదిద్దే ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది అన్నారు.
ప్రధాని మోదీ సహకారంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో.. డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ దార్శనికతతో తమంతా ఏపీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని వంశీకృష్ణ చెప్పారు.
డల్లాస్ లో తనకు లభించిన అపూర్వ స్వాగతానికి డల్లాస్ జన సైన్యానికి ప్రత్యేకంగా ధనవాదాలు తెలిపారు వంశీకృష్ణ యాదవ్.