Dadasaheb Phalke Biopic: భారత సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ వెండితెరపై రానుంది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఈ బయోపిక్ ప్రాజెక్ట్ చర్చనీయాంశమైంది. ఓవైపు రాజమౌళి సమర్పణలో ఎన్టీఆర్ టైటిల్ రోల్ చేయనున్నారన్న వార్తలు.. మరోవైపు బాలీవుడ్ సూపర్ కాంబో ఆమిర్ ఖాన్ – రాజ్ కుమార్ హిరాణీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారన్న ప్రచారం ఒక్కసారిగా హైప్‌ను పెంచేశాయి.
రెండు ప్రాజెక్టులూ ఒక్కసారిగా వార్తల్లోకి..
రాజమౌళి సమర్పణలో, ఆయన తనయుడు కార్తికేయ, నిర్మాత వరుణ్ గుప్తాతో కలిసి ఈ బయోపిక్ అనౌన్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి. దర్శకుడు నితిన్ కక్కర్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ రూపొందనుందన్న ప్రచారం జోరుగా సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నారన్న సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.
కానీ… అదే సమయంలో బాలీవుడ్ వర్గాల్లోనూ మరో వర్షన్ బలంగా వినిపించింది. ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ కలయికలో ఈ బయోపిక్ రూపొందనుందని కథనాలు వస్తున్నాయి. దీనిపై సినీ ప్రపంచంలోనూ, ప్రేక్షకుల్లోనూ కన్ఫ్యూజన్ నెలకొంది.
ఇది కూడా చదవండి: Nagarjuna: నాగార్జున స్వాగ్: సీఎం రేవంత్‌తో డిన్నర్.. వైరల్!
దాదాసాహెబ్ మనవడు క్లారిటీ ఇచ్చారు
ఈ సందిగ్ధతకు ముగింపు పలికింది ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స్పందించడంతో. ఓ ఇంటర్వ్యూలో అయన మాట్లాడుతూ – “రాజమౌళి టీమ్ ఎప్పుడూ నన్ను సంప్రదించలేదు. కానీ ఆమిర్ ఖాన్ టీమ్ గత మూడేళ్లుగా నా వద్దకు వస్తూ వివరాలు సేకరిస్తూ ఉన్నారు. వాళ్ల అసిస్టెంట్ ప్రొడ్యూసర్ నాతో చాలాసార్లు టచ్‌లో ఉండి అంతర్గత విషయాలన్నీ తెలుసుకున్నారు. వాళ్ల నిజాయితీ నాకు ఎంతో నచ్చింది. దాదాసాహెబ్ పాత్రను ఆమిర్ ఖాన్ నటించడం నాకు సంతోషమే’’ అని స్పష్టం చేశారు.
అక్టోబర్‌లో షూటింగ్ స్టార్ట్
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయి. ‘సితారే జమీన్ పర్’ రిలీజ్ అయిన వెంటనే ఆమిర్ ఖాన్ ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. దాదాసాహెబ్ భార్య సరస్వతిబాయి పాత్రకు విద్యా బాలన్ చేస్తే బాగుంటుది అని చంద్రశేఖర్ అన్నారు.
సినీ చరిత్రలో మైలురాయి అవుతుందా?
భారతీయ సినిమాకి పునాది వేశాడు దాదాసాహెబ్ ఫాల్కే. అలాంటి మహనీయుడి కథను కచ్చితంగా, గౌరవంగా తెరపైకి తీసుకురావాలంటే ప్రామాణిక సమాచారం, కుటుంబ సభ్యుల ఆమోదం ఎంతో అవసరం. ఈ క్రమంలో ఆమిర్ ఖాన్ టీమ్ ముందడుగు వేసి ప్రొఫెషనల్‌గా వ్యవహరించడం సినీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది.
ఎన్‌టీఆర్ వెర్షన్‌పై ఇంకా స్పష్టత రాకపోయినా, అధికారికంగా ప్రస్తుతం ఫాల్కే మనవడు చెప్పిన మాటలతో ఆమిర్ ఖాన్ ప్రాజెక్ట్‌నే అసలైన బయోపిక్‌గా పరిశీలించవచ్చు. సినిమా ఇండస్ట్రీతో పాటు భారతీయ సినీ అభిమానులు ఈ బయోపిక్‌పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

