CV Anand: సినీ అభిమానులకు ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అయ్యే కొత్త సినిమాలను నిమిషాల వ్యవధిలో, ఎటువంటి ఖర్చు లేకుండా హెచ్‌డీ క్వాలిటీతో అందిస్తూ, అభిమానులకి ఇష్టమైన సైట్‌గా మారింది. అయితే, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ తగ్గడానికి ‘ఐబొమ్మ’ ప్రధాన కారణంగా నిలిచింది.
కొద్ది రోజులుగా ఈ సైట్ కేవలం ఓటీటీ కంటెంట్ మాత్రమే కాదు, థియేటర్‌లో కొత్తగా విడుదల అయ్యే టాలీవుడ్ సినిమాల హెచ్‌డీ ప్రింట్స్‌ను కూడా పైరసీ చేస్తోంది. దీంతో టాలీవుడ్ పరిశ్రమలో అలర్ట్ స్థాయి పెరిగింది. సీనియర్ సినీ నిర్మాతలతో కలిసి హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ పైరసీ ముఠాలను పట్టుకున్నారు.
ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, నాని, రామ్, నాగచైతన్య, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకులు తదితరులు హాజరయ్యారు. పోలీసులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పైరసీ ముఠాల కార్యకలాపాలను వివరించారు. సినిమాలు థియేటర్‌లో విడుదలకానముందే హెచ్‌డీ ప్రింట్లు ఎక్కడ నుంచి బయటకు వస్తున్నాయో చూసి అందరికి షాక్ ఎదురయ్యింది.
ఇది కూడా చదవండి: October 1 New Rules: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. యూపీఐ నుంచి NPS, PF వరకు రాబోయే అతిపెద్ద మార్పులివే.. ఫుల్ డిటెయిల్స్..!
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, హ్యాకర్లకు, పైరసీ ముఠాలకు బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు సహకరిస్తున్నారని తేలింది. సీనియర్ పోలీసు సీఈవీ ఆనంద్ వార్నింగ్ ఇస్తూ, త్వరలోనే ‘ఐబొమ్మ’ నిర్వాహకులను కూడా అరెస్టు చేస్తామని స్పష్టంగా తెలిపారు. “దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేసి ఆధునిక పరికరాల ద్వారా పైరసీ ముఠాను పట్టుకున్నాం. ఐబొమ్మ నిర్వాహకులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం” అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఐబొమ్మకు చెందిన నాలుగు మంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారని సమాచారం ఉంది. అయితే, అసలు సైట్‌ను నడుపుతున్న వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఈ వార్త తెలిసిన కొంత మంది ఐబొమ్మ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “టికెట్ రేట్లు పెరిగితే సామాన్య ప్రజలు కుటుంబంతో సినిమాను ఎలా చూడగలరు?” అని ప్రశ్నిస్తున్నారు.
టాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడు క్రమంగా ఈ సమస్యపై గట్టిగా స్పందిస్తోంది. హీరోలు, నిర్మాతలు, మరియు సైబర్ క్రైమ్ అధికారులు కలిసి పని చేస్తూ, భవిష్యత్తులో పైరసీ తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.

