CV Anand: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అరుదైన అవార్డును అందుకోనున్నారు. డ్రగ్స్ కట్టడిలో ఆయన కీలక పాత్ర పోషించినందుకు అంతర్జాతీయ స్థాయి అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. హైదరాబాద్ నగర పరిధిలో చేపట్టిన వినూత్న కార్యక్రమాలతో డ్రగ్స్ కట్టడిలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు.
CV Anand: దుబాయ్‌లో జరిగే అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్‌లో సీపీ ఆనంద్ ఎక్స్‌లెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డు కోసం మొత్తం 138 దేశాలు పోటీ పడటం విశేషం. ప్రపంచ దేశాల్లో అంతర్జాతీయ స్థాయి నగరాల పరిధిలో డ్రగ్స్ కట్టడిపై జరిపిన సర్వేలో ఆనంద్ ఉత్తమ ఫలితాలు సాధించినట్టు తేలిందని నిర్వాహకులు తెలిపారు.
CV Anand: హైదరాబాద్ నగర సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు తీసుకున్న తర్వాత డ్రగ్స్ కట్టడిలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నగరంలోని పలు పబ్బులపై ఉక్కుపాదం మోపారు. వరుసగా దాడులు నిర్వహిస్తూ డ్రగ్స్ కట్టడికి విశేష కృషి చేశారు. దీంతో డ్రగ్స్ కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి.
CV Anand: ఇటీవల పెద్ద ఎత్తున సరఫరా అవుతున్న గంజాయిని కూడా నిర్మూలించడంలో సీపీ ఆనంద్ సఫలం అయ్యారు. ఆయా విషయాలపై ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్టు తెలుస్తున్నది. గతంలో సీవీ ఆనంద్ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. సైబరాబాద్ కమిషనర్ గా విధులు నిర్వహించారు.