Telangana:గురుకుల పాఠశాలలు, వసతి గృహాలకు అద్దెల పేరిట తాళాలేస్తున్న యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. నెలలుగా అద్దెలు చెల్లించడం లేదంటూ దసరా సెలవుల అనంతరం పునఃప్రారంభమైన మంగళవారం వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులను లోనికి వెళ్లకుండా రాష్ట్రంలోని పలుచోట్ల యాజమాన్యాలు తాళాలేసిన ఘటనలు చోటుచేసుకొన్నాయి.
Telangana:ఈ మేరకు స్పందించిన మంత్రి యాజమానుల చర్యలపై మండిపడ్డారు. ఎవరో చెప్పిన మాటలు విని భవనాలకు తాళాలు వేయకండి, నేడో రేపో నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గురుకులాల మంత్రిగా తాను విజ్ఞప్తి చేస్తున్నా, గురుకులాల గేట్లకు పెట్టిన బ్యానర్లను వెంటనే తొలగించండి అని కోరారు. వెంటనే యాజమాన్యాలు తన వినతిని స్వీకరించాలని సూచించారు.
Telangana:ఎక్కడైనా ఇంకా గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల భవనాల యాజమానులు ఇబ్బందులు పెడుతుంటే వెంటనే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయాలని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.

