Salt: ఉప్పు మనిషి జీవితంలో పెను ముప్పుగా మారుతున్నది. ఉప్పు ఎక్కువగా వాడితే ఆరోగ్యపరంగా పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ప్రాణాంతకానికి దారితీస్తుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల హైబీపీ, గుండె జబ్బులు, చర్మ సంబంధిత సమస్యల వరకు ప్రమాదాలు పెరుగుతాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
Salt: ఉప్పును తక్కువగా తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను జారీ చేసింది. ఆహారంలో సాధారణ టేబుల్ స్టాల్ కాకుండా పోటాషియం ఉన్న తక్కువ సోడియం సాల్ట్ వాడాలని చెప్తున్నది. ఈ సిఫారసు పెద్దలు, ఆరోగ్యకరమైన వ్యక్తుల కోసం మాత్రమేనని, గర్భిణులు, పిల్లలు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు సాధారణ ఉప్పునే తినాలని చెప్తున్నది.
Salt: ఉప్పు ఎక్కువగా కానీ, తక్కువ కానీ వాడకూడదు. ఇలా చేస్తే లోబీపీ, హైబీపీ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిని సమతుల్య పరిమాణంలో తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రామాల చొప్పున మాత్రమే ఉప్పు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది.
Salt: కానీ భారతీయులకు ఉప్పును విడిగా తినే అలావాటు ఉన్నది. భారతీయులు చాలా మంది తమ ఇండ్లల్లో అన్నం తినే టేబుల్‌పై ఉప్పు డబ్బాను సిద్ధంగా ఉంచుకుంటారు. ఒకవేళ నోటికి రుచి కొట్టకపోతే ఏకంగా ఆ డబ్బాలోంచి ఉప్పును వేసేసుకుంటారు. దీంతో ఉప్పు ఆహారంలో అధికంగా వెళ్తుందన్నమాట. ఈ సమయంలో డబ్ల్యూహెచ్‌వో సంస్థ హెచ్చరికలను తప్పక పాటించాల్సి ఉంటుంది.
Salt: ప్రధానంగా ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. గుండెజబ్బులకు దారితీస్తుంది. ఎముకలు బలహీనపడుతాయి. జీర్ణసంబంధ, మూత్రపిండ సమస్యలు తరచూ వస్తుంటాయి. బరువు పెరుగుదలకు కారణమవుతుంది. డీ హైడ్రేషన్‌కు లోనవుతారు. పలు రకాల చర్మ సమస్యలకు ఉప్పు కారణమవుతుంది. అందుకే ఉప్పు ముప్పు అని.. పరిమితమైన ఉప్పే వాడాలని సూచిస్తున్నారు.