Kondapalli Srinivas Rao: : శ్రీ పైడితల్లి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టు వస్త్రాలను సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కొండపల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించే అవకాశం దక్కడం తన అదృష్టం.ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి లకు కృతజ్ఞతలు సినిమానోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాంనిర్ణీత సమయానికి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. పోలీసులు కూడా భక్తులకు చక్కని సహకారాన్ని అందిస్తున్నారని, జాతరకు వచ్చే భక్తులను అతిధులుగా చూడాలని పోలీసులను ఇప్పటికే ఆదేశించామని మంత్రి తెలిపారు.
