Crime News:వివాహేతర బంధాలు భర్తల ప్రాణాల మీదికి వస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. భర్త, పిల్లలను దూరం చేసుకునేందుకు కొందరు మహిళలు ఎంతకైనా తెగిస్తున్నారు. చివరికి కటకటాల పాలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో తాజాగా చోటు చేసుకున్నది.
Crime News:చిత్తూరు నగరంలోని సంతపేట పరిధి దుర్గమ్మ వీధిలో బీ వెంకటేశ్ అనే వ్యక్తి ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు చేపట్టిన దర్యాప్తులో పోలీసులకు అసలు నిజాలు తెలిశాయి. భార్య వివాహేతర సంబంధమే వెంకటేశ్ మరణానికి కారణమని పోలీసుల విచారణలో తేలింది.
Crime News:వెంకటేశ్ రెండో భార్య తులసి మునియమ్మ అలియాస్ (22)పై అనుమానంతో పోలీసులు విచారణ జరిపారు. ఆమెకు సురేశ్ (23) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పెళ్లయిన కొన్నాళ్లకే సురేశ్‌తో ఆమె వివాహేతర బంధం పెట్టుకున్నదని విచారణలో తేలింది. ఈ విషయం వెంకటేశ్‌కు తెలియడంతో భార్యను నిలదీశాడు.
Crime News:తమ బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను చంపేందుకు కావ్య సిద్ధపడింది. ఇదే విషయాన్ని ఆమె తన ప్రియుడితో చెప్పి ప్లాన్ చేసింది. ఇంటిలో భర్త వెంకటేశ్ నిద్రిస్తున్న సమయంలో తాడుతో గొంతు నులిమి చంపేశారు. అనంతరం తాడుతో వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. దీంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు, లోతుగా దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో కావ్య, సురేశ్‌తో కలిసి వెంకటేశ్‌ను చంపినట్టు నిర్ధారించారు. వారిద్దరినీ అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.