Crime News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తాళం వేసిన గదిలో ఇద్దరు చిన్నారులు చనిపోయి, తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడన్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన పిల్లలను చంపి, తానూ చనిపోతున్నానన్న సూసూడ్ నోట్ సృష్టించిన తండ్రి అసలు చనిపోలేదని తేలింది. తన భార్యపై అనుమానమే పెనుభూతమై తన ఇద్దరు పిల్లలను అమానుషంగా చంపాడని తెలుస్తున్నది. ఆ కాఠిన్యమున్న తండ్రిని సాంకేతిక అంశాలతో పట్టుకున్న పోలీసులు అరెస్టు చేశారు.
Crime News: మైలవరంలో రవిశంకర్, చంద్రిక భార్యాభర్తలు. వారికి హిరణ్య ((9), లీలసాయి (7) ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవిశంకర్, చంద్రికలు ప్రేమవివాహం చేసుకున్నారు. కుటుంబ పోషణ కోసం చంద్రిక బహ్రయిన్ దేశం ఉపాధి కోసం వెళ్లింది. అక్కడి నుంచే పిల్లలతో, భర్తతో తరచూ ఫోన్ లో మాట్లాడుతుండేది. రవి భర్త్‌డే రోజు ఫోన్ చేసి హ్యాపీ భర్త్‌డే రవి అంటూ మాట్లాడింది. పిల్లల పట్ల జాగ్రత్తలు చెప్పింది.
Crime News: మరునాడు ఫోన్ చేస్తే భర్త ఫోన్ ఎత్తలేదు. ఎంతగా ఆచూకీ లేకపోవడంతో తన వదినను ఇంటికి వెళ్లి చూసి రమ్మనడంతో తాళం వేసి ఉన్నదని, తలుపులు బలవతంగా తీసి చూడగా, విగతజీవులై పడి ఉన్నారు. బంధువులకు అందిన సమాచారంలో తనను పట్టించుకునే వారే లేరని, తన పిల్లలను చంపి, తాను చనిపోతున్నట్టు ఉన్నది. అతని ఫోన్ సిగ్నల్స్ కృష్ణానది ఒడ్డన వస్తున్నది. దీంతో అతను నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Crime News: తాజాగా అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. ఎంతగా వెతికినా రవిశంకర్ మృతదేహం లభించకపోవడంతో అతను బతికే ఉన్నాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతని బ్యాంకు లావాదేవీలు, సాంకేతిక అంశాలపై విచారణ చేపట్టగా, అతని పేరిట మరో సిమ్‌కార్డు కొనుగోలు చేసినట్టు తేలింది. దానిపై కాల్స్ వెళ్తున్నట్టు తేలింది. అతని ఫోన్ ట్రేస్ చేయగా, విశాఖలో ఉన్నట్టు తేలడంతో అక్కడికి వెళ్లి రవిశంకర్‌ను అరెస్టు చేసి తీసుకొచ్చారు. భార్యపై అనుమానంతోనే పిల్లలను చంపి పారిపోయినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో రవిశంకర్ అంగీకరించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.

