Crime News: ఓ రౌడీషీటర్ వేధింపులు తాళలేక ఓ వివాహిత తన నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది. ఖమ్మం జిల్లా రఘునాథపాలంఎ మండలం వీ వెంకటాయ పాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని జగ్యాతండాలో ఈ ఘటన చోటుచేసుకున్నది. కూలిపనులకు వెళ్లిన ఆ మహిళ వద్దకు వెళ్లిన ఆ దుండగుడు తన కోరిక తీర్చాలంటూ వేధించడంతో ఆ మహిళ తనువు చాలించింది.
Crime News: జగ్యాతండా గ్రామానికి చెందిన బోడ సుశీల (28) అదే గ్రామానికి చెందిన మరో మహిళతో కలిసి పత్తి ఏరడానికి అమ్మపాలెం గ్రామానికి వెళ్లింది. పొలంలో పనిచేస్తున్న సుశీల వద్దకు వెళ్లిన రౌడీషీటర్ ధరావత్ వినయ్.. తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించసాగాడు. దాని ఒప్పుకోని ఆ మహిళ ప్రతిఘటించడంతో ఆమెపై ఆ దుండగుడు దాడికి పాల్పడ్డాడు.
Crime News: తీవ్రగాయాలపాలైన ఆ బాధితురాలు ఇంటికి వచ్చి మనస్తాపంతో తన ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. సుశీల భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుడిని కఠినంగా శిక్షించాలని, తమ కుటుంబానికి జరిగిన అన్యాయంపై తగు న్యాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటున్నది. ఇదిలా ఉండగా, సుశీల ఒంటిపై ఉన్న గాయాలను పోస్టుమార్టం రిపోర్ట్‌లో చేర్చకుండా పోలీసులు కేసును నీరుగార్చే పనిచేస్తున్నారని సుశీల భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.