Crime News: జనగామ జిల్లా కేంద్రంలోని సబ్ జైలులో దారుణం చోటుచేసుకున్నది. రిమాండ్‌లో ఉన్న ఖైదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (అక్టోబర్ 12) మృతి చెందాడు. సింగరాజుపల్లిలో స్నేహితులు కొట్టుకున్న కేసులో అదే గ్రామానికి చెందిన మల్లయ్యను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. దీంతో ఆయనను జనగామ సబ్ జైలులో ఉంచారు.
Crime News: నిన్న సబ్ జైలులో ఉన్న బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, జైలు సిబ్బంది గమనించి చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్టు జైలు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతూ వరంగల్ ఎంజీఎంలోనే మల్లయ్య మృతి చెందినట్టు తెలిపారు. దీంతో రిమాండ్‌లో ఉన్న వ్యక్తి మరణంతో దుమారం చెలరేగుతున్నది.
Crime News: మల్లయ్య మృతి ఘటనకు నిరసనగా అతని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు సబ్ జైలు ఎదుట నిరసనకు దిగారు. జైలు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మల్లయ్య మరణానికి జైలు అధికారులే కారణమంటూ వారంతా ఆరోపించారు. ఈ మేరకు జనగామ డీసీపీకి వారంతా ఫిర్యాదు చేశారు.