Crime News: దొంగతనం ఎప్పటికీ దాగదు.. అన్న నానుడి నిజమే అనడానికి ఇదే నిదర్శనం. చేసిన తప్పునకు శిక్ష అనుభవించక తప్పదు.. అన్న దానికీ ఇదే ఉదాహరణ. ఓ వ్యక్తి క్షణికావేశంతో హత్య చేసి, పరారైనా ఆ కేసు అతన్ని రెండు సంవత్సరాలుగా వెన్నాడుతూనే ఉన్నది. చివరికి పోలీసులు అతని అలికిడి కనిపెట్టి అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
Crime News: వికారాబాద్ జిల్లాకు చెందిన బాలాజీ రెండేళ్ల క్రితం రవి అనే వ్యక్తి వద్ద రూ.2,000ను అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పును తిరిగి ఇవ్వమని బాలాజీని రవి అడిగాడు. అంతే కోపం నషాలానికి అంటుకున్నది. అవమానంగా భావించాడో, అక్కసుతోనే కానీ, ఆవేశంతో కత్తితో రవిని అక్కడికక్కడే దాడి చేసి చంపేశాడు. ఆ ఘటనతో కలకలం రేగింది. భయపడ్డాడో ఏమో కానీ తప్పించుకొని పారిపోయాడు.
Crime News: ఆ తర్వాత నుంచి అతను కనిపించకుండా అదృశ్యమయ్యాడు. హత్యకేసులో అతనిపై కేసు నమోదైంది. రెండు సంవత్సరాల వరకూ కనిపించకుండా తప్పించుకొని తిరిగాడు. అతని ఆచూకీ కోసం వెతుకుదామంటే.. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, సెల్ ఫోన్ లేకపోవడంతో సాధ్యంకాలేదు. అయితే పోలీసులు అతని కుటుంబ సభ్యులపై నిఘా ఉంచారు.
Crime News: ఇటీవల సంగారెడ్డిలో ఉన్న సోదరుడి ఇంటికి బాలాజీ వచ్చినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి బాలాజీని అదుపులోకి తీసుకొని, రిమాండ్కు తరలించారు. చూశారా? రెండేండ్లు దాటినా చేసిన పాపం వెంటాడి మరీ పట్టించింది. చివరికి శిక్ష తప్పదని నిరూపించింది.