Rinku Singh

Rinku Singh: స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ ప్రేమకథ: రాజకీయ నాయకురాలితో నిశ్చితార్థం!

Rinku Singh: యువ క్రికెటర్ రింకూ సింగ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా పంచుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో తన నిశ్చితార్థం, వారి ప్రేమకథ గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. భిన్నమైన వృత్తులలో ఉన్న ఈ జంట ప్రేమ బంధం ఎలా మొదలైందో రింకూ వివరించారు.

2022లో ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఈ ప్రేమకథ మొదలైనట్లు రింకూ తెలిపారు. ఒక అభిమానుల పేజీలో ప్రియా సరోజ్ ఫోటో చూసి ఆమెను ఇష్టపడ్డానని, అప్పుడే ఆమె తనకు సరైన భాగస్వామి అవుతుందని అనిపించిందని అన్నారు. అయితే, మొదట మెసేజ్ చేయడానికి ధైర్యం చేయలేదని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫోటోలను లైక్ చేయడంతో, రింకూ ధైర్యం చేసి మెసేజ్ చేశాడట. అలా మొదలైన వారి సంభాషణ ప్రేమగా మారింది.

Rinku Singh

ప్రియ ఎంపీగా ఎన్నికైన తర్వాత కూడా తమ ప్రేమలో ఎలాంటి మార్పు రాలేదని రింకూ చెప్పారు. ప్రియ ప్రజల సమస్యలతో, పార్లమెంట్ సమావేశాలతో బిజీగా ఉండగా, తాను మ్యాచ్‌లతో బిజీగా ఉంటానని, అందువల్ల ఎక్కువ సమయం మాట్లాడుకోలేకపోతున్నామని అన్నారు. అయితే, రాత్రివేళల్లో కొద్దిసేపైనా మాట్లాడుకుని ఒకరికొకరు సలహాలు, సూచనలు ఇచ్చుకుంటామని తెలిపారు.

Also Read: Matthew Breetzke: వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్

జూన్ 8న లక్నోలో జరిగిన ఒక వేడుకలో రింకూ, ప్రియల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. వాస్తవానికి ఈ ఏడాది నవంబర్‌లోనే వీరి వివాహం జరగాల్సి ఉండగా, రింకూ క్రికెట్ షెడ్యూల్స్ కారణంగా పెళ్లిని వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. రింకూ ఈ నిశ్చితార్థానికి కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్‌ను కూడా ఆహ్వానించారు. ఇదిలా ఉండగా, ఆసియా కప్ జట్టులో తన ఎంపిక పట్ల ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ, సెలక్టర్లు తనపై ఉంచిన నమ్మకం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని రింకూ అన్నారు.

Rinku Singh

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *