Spirit: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్! సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం పూర్తి స్థాయి కాప్ డ్రామాగా రూపొందనుంది. ఈ సినిమాలో ప్రభాస్ రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా తన విశ్వరూపాన్ని చాటనున్నాడు.
అయితే, ఈ పాత్ర కోసం ప్రభాస్ స్లిమ్ లుక్‌లోకి మారనున్నాడని, అందుకే షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.’స్పిరిట్’ చిత్రీకరణ భారత్‌తో పాటు విదేశాల్లోనూ జరగనుందట. ఈ సినిమాలో కొరియన్, అమెరికన్ నటులు కూడా నటించే ఛాన్స్ ఉందని టాక్.
Also Read: Akhanda 2: అఖండ 2: ఇంటర్వెల్ కోసం భారీ సెట్!
Spirit: ఇంత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుందనేది ఇప్పట్లో చెప్పడం కష్టమని అభిమానులు అంటున్నారు. సందీప్ వంగా మార్క్ యాక్షన్‌తో పాటు ప్రభాస్ స్టైలిష్ అవతార్‌ను చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. మరి, ‘స్పిరిట్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!