Coolie

Coolie: అందుకే.. ‘కూలీ’ సినిమాకు కార్పొరేట్ బుకింగ్స్..!

Coolie: బాలీవుడ్‌లో ఎక్కువగా వినిపించే కార్పొరేట్ బుకింగ్స్ ట్రెండ్ ఇప్పుడు సౌత్‌లో కూడా కనిపిస్తోంది. ఆగస్టు 14న విడుదల కానున్న సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా కోసం పెద్ద ఎత్తున కార్పొరేట్ బుకింగ్స్ జరుగుతున్నాయన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఆ రోజే బాలీవుడ్ యాక్షన్ డ్రామా వార్ 2 కూడా రిలీజ్ అవుతుంది. రెండు సినిమాలకూ భారీ అంచనాలు ఉన్నప్పటికీ, కూలీ బుకింగ్స్ మాత్రం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. వార్ 2 బుకింగ్స్ నెమ్మదిగా సాగుతుండగా, కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ వేగంగా పెరుగుతున్నాయి.

ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, కొన్ని కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం థియేటర్లనే మొత్తం బుక్ చేస్తున్నాయట. ఓ థియేటర్ యజమాని చెప్పినట్టుగా, రజనీ సినిమాకు మూడు రోజుల పాటు థియేటర్లు బ్లాక్ చేసారని, దక్షిణాదిలో ఇంతకుముందు ఏ సినిమాకూ ఇలాంటివి జరగలేదని తెలిపారు.

ఇది కూడా చదవండి: Nagarjuna: టబు-రమ్యకృష్ణా?.. నాగార్జున ఫేవరెట్ ఎవరో తెలిసిపోయింది..

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమాలో, రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, సత్యరాజ్ వంటి వివిధ భాషల స్టార్ హీరోలు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.

ఓవర్సీస్‌లో ఇప్పటికే బలమైన అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన కూలీ, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 68.5 కోట్లకుపైగా కలెక్షన్స్ సంపాదించినట్లు సమాచారం. అయితే ఈ బుకింగ్స్‌లో చాలా భాగం కార్పొరేట్ బుకింగ్స్ వల్లనేనని కొంతమంది చెబుతున్నారు.

మరోవైపు, కొందరు నెటిజెన్లు “హైప్ క్రియేట్ చేయడానికే ఈ కార్పొరేట్ బుకింగ్స్” అంటూ విమర్శిస్తుండగా, అభిమానులు మాత్రం ఇది సూపర్ స్టార్ క్రేజ్ ఫలితమే అంటున్నారు.

ఆగస్టు 14న కూలీ vs వార్ 2 క్లాష్‌లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద గెలుస్తుందో చూడాలి. రెండు రోజుల్లో అసలు ఫలితం తెలిసిపోతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Viral Video: మనువరాలి ముందు చిన్న పిల్లాడిలా నటించిన 96 ఏళ్ల తాత.. వైరల్ అవుతున్న వీడియో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *