Coolie Day 1 Collection

Coolie Day 1 Collection: విజయ్ ని వెనక్కి నెటేసిన రజనీ.. ఆల్ టైం రికార్డు పెట్టిన రజిని కాంత్

Coolie Day 1 Collection: భారీ అంచనా మీద వచ్చిన సినిమా కూలి. అనుకున్నట్లుగానే సూపర్‌స్టార్ రజనీకాంత్‌ తాజా చిత్రం ‘కూలీ’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా, మొదటి రోజే కలెక్షన్ల  విషయంలో చరిత్ర సృష్టించింది.

సన్ పిక్చర్స్‌ ప్రకటించిన అధికారిక వివరాల ప్రకారం, రిలీజ్‌ రోజు రూ.151 కోట్లకుపైగా (గ్రాస్) వసూళ్లు సాధించి, ఫస్ట్ డే హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచిన తమిళ్‌ సినిమాగా ‘కూలీ’ పేరు ముద్ర వేసుకుంది. ఇదివరకూ ఈ రికార్డు విజయ్ దళపతి నటించిన ‘లియో’ (రూ.140 కోట్లు+) పేరిట ఉండగా, ఇప్పుడు దానిని రజనీ సినిమా అధిగమించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రెండు చిత్రాలను కూడా దర్శకుడు లోకేశ్ కనగరాజ్నే తెరకెక్కించారు.

ఇది కూడా చదవండి: Venky77 Pooja Ceremony: వెంకటేష్ – త్రివిక్రమ్ సినిమా ప్రారంభం..

అంతే కాదు, ఓవర్సీస్‌లోనూ ‘కూలీ’ అసాధారణ రికార్డులు నమోదు చేసింది. ప్రీ-బుకింగ్స్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ్‌ సినిమాగా ఇది కొత్త చరిత్ర రాసింది. అడ్వాన్స్‌ బుకింగ్స్ మొదలైన దగ్గర నుంచే అభిమానుల క్రేజ్‌ అంచనాలకు మించి పెరిగి, మొదటి రోజు హౌస్‌ఫుల్ షోలు నిండిపోయాయి.

స్టార్‌ కాస్ట్ & టెక్నికల్ బ్రిలియన్స్
‘కూలీ’లో రజనీతో పాటు అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, రెబా మోనికా జాన్, రచితా రామ్ వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషించారు. పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ ‘మోనికా’ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా, సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ విలువలు మరింత గ్రాండ్‌గా కనబడుతున్నాయి.

మొదటి రోజు టాప్ తమిళ్ సినిమాల జాబితా

  1. కూలీ – ₹151 కోట్లు+

  2. లియో – ₹140 కోట్లు+

  3. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ – ₹100 కోట్లు+

  4. 2.O – ₹100 కోట్లు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *