Gadwal: ప్రియురాలి అనుమానాస్పద మృతి కేసులో జోగులాంబ గద్వాల జిల్లాలో కానిస్టేబుల్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ ను మల్దకల్ పోలీసులు అదుపులోకి తీసుకోగా DSP మొగులయ్య విచారిస్తున్నారు. గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్ కు కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక అనే యువతి కోచింగ్ సెంటర్ లో ఉండగా పరిచయం అయింది. నాలుగేళ్లుగా ఇద్దరు ప్రేమించుకోగా తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. రఘునాథ్ గౌడ్ కి పోలీసు ఉద్యోగం వచ్చాక ప్రియాంకను దూరం పెట్టడంతో….DSPకి ఫిర్యాదు చేయగా ఇంతకు ముందు ఓ సారి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తనని పెళ్లి చేసుకోవాలంటూ…..రఘునాథ్ కు చెందిన మరో ఇంట్లో 3 నెలలుగా ఉంటూ నిరసన తెలుపుతున్న ప్రియాంక…శుక్రవారం రాత్రి మృతిచెందింది. ఐతే, రఘునాథ్ కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని ప్రియాంక కుటుంబీకులు ఆరోపించారు. తాజాగా అధికారులు రఘునాథ్ గౌడ్ పై చర్యలు తీసుకున్నారు. కాగా ప్రియాంక మృతి చెందటంతో ఆమె బంధువులు, స్థానికులు రఘునాథ్ గౌడ్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
