Viral News: మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవలి రోజుల్లో గుండెపోటు సమస్య పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో ఇలాటి ఘటనలు తరచుగా చుస్తునాం. ఇప్పుడు, తమిళనాడులో ఇలాంటిదే మరో గుండెపోటు కేసు వెలుగులోకి వచ్చింది, బస్సు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ గుండెపోటుకు గురై స్పృహ కోల్పోయాడు. డ్రైవర్ కుప్పకూలిపోవడంతో, బస్సు నియంత్రణ కోల్పోయి అదుపు తప్పింది కండక్టర్ తన సమయస్ఫూర్తితో వెంటనే తన చేతితో బ్రేక్ వేసి బస్సును ఆపేశాడు, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది, ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు:
ఈ సంఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో శుక్రవారం (మే 23) జరిగింది. పళని బస్టాండ్ నుండి పుదుకోట్టైకి ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కండక్టర్ వెంటనే పరిగెత్తి, తన సమయస్ఫూర్తితో బస్సును ఆపి, బస్సులోని 35 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. దురదృష్టవశాత్తు, డ్రైవర్ ప్రభు గుండెపోటుతో మరణించాడు. ఈ దృశ్యం బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
பழனி அருகே மாட்டுப் பாதையில் தனியார் பேருந்து ஓட்டுநர் திடீர் மாரடைப்பால் மரணம். துரிதமாக செயல்பட்டு பேருந்தை நிறுத்திய நடத்துநர்.#heartattack #TamilNadu #Chanakyaa
Stay informed with the latest news through Chanakyaa via https://t.co/sbYbLDGhBo pic.twitter.com/358EDntWLE
— சாணக்யா (@ChanakyaaTv) May 23, 2025
ChanakyaaTv అనే X ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోలో, బస్సు కదులుతున్నప్పుడు డ్రైవర్ కుప్పకూలిపోతున్నట్లు చూడవచ్చు. డ్రైవర్ కుప్పకూలిపోవడంతో, బస్సు నియంత్రణ కోల్పోయింది, వెంటనే పరిగెత్తిన కండక్టర్ తన చేతులతో అత్యవసర బ్రేక్‌లను వేసి బస్సును ఆపి ప్రయాణికులను రక్షించాడు. తరువాత, ప్రయాణికులు మరియు కండక్టర్ డ్రైవర్ ప్రభుకు సహాయం చేయడానికి పరుగెత్తారు. ఈ దిగ్భ్రాంతికరమైన దృశ్యాన్ని చూసి చూపరులు షాక్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Crime News: పోలీస్ పెట్రోల్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఒక కానిస్టేబుల్ దుర్మరణం.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు