Collector Anand

Collector Anand: రూల్స్ బ్రేక్ చేస్తే తగ్గేదేలేదు.. కలెక్టర్ ఆనంద్ మార్క్ పాలన

Collector Anand: నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో కూటమి బంఫ్‌ర్ విక్టరీ కొట్టింది. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు వైసీపీ అధిక్యం ఉండే… ఈ సారి కూటమి విజయంపై ప్రజలకు అంచనాలు కూడా భారీగా పెరిగాయి. అయితే నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యేలు వేగంగా పని చేయడం లేదనే విమర్సలు మొదలైపోయాయి. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగతా వారంతా సొంత వ్యాపారాలు, మైన్లు, ఇసుక, కాంట్రాక్టు పనులపై దృష్టి పెట్టేసి నియోజకవరంలోని ప్రజా సమస్యలను అధికారులకు వదిలేసి టైమ్ పాస్ చేస్తున్నారనే టాక్‌ నడుస్తోంది.

ఈ సమయంలో కూటమి ప్రభుత్వానికి లడ్డూలా దోరికారు ఒక ఉన్నాతాధికారి. ఆయనే నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్…ఆనంద్ మంచి కాఫీలాంటి కుర్రోడు అనే సినిమాలో లాగ నెల్లూరు జిల్లా అభివృధ్దికి ఆయన చూపే చొరవ చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయంటా…రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో పనులు నెమ్మదించడం, వ్యవసాయ పనులు తగ్గడంతో పల్లెల్లో ప్రజలకు పెద్దగా పనులు దోరకడం లేదు. దీంతో ఉఫాది హమీ పథకం కింద నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూలీలు, వ్యవసాయ కార్మికులు, గ్రామస్దులకు జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద వంద రోజుల పనులు చూపే పథకాన్ని పక్కాగా అమలు చేయడంలో ఆనంద్‌ సక్సెస్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి: Gold rate: భారీగా పెరుగుతున్న బంగారం ధర..

Collector Anand: కలెక్టర్ ఆనంద్ తన ఐదు నెలల పాలనలో సక్సెస్ అయిన వింగ్‌లో ఉచిత ఇసుక విధానం గురించి కూడ ప్రముఖంగా చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద పెద్ద లీడర్లు సైతం తమ బంధువులు, అనుచరులతో ఇసుక స్మగ్లింగ్‌కు తెగబడ్డారని తీవ్ర విమర్సలు చెలరేగాయి.

ఉచిత ఇసుక కాదు కదా, కనీసం వైసీపీ హయాంలో కంటే డబుల్, త్రీబుల్ రేట్లకు కూడ ఇసుక దోరకని దుస్దితి నెల్లూరు జిల్లాకు ఎదురైంది. దీంతో ఇసుక లభ్యత నదుల్లో తగ్గడంతో పాటు టీడీపీ పెద్దలు నేరుగా ఇసుక స్మగ్లింగ్ దిగడం కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సమయంలో రంగంలోకి దిగిన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ టీడీపీ నేతల అనుచరులకు వార్నింగ్ ఇచ్చారు. నేరుగా ఇసుక రీచ్‌లకు తరచు వెళ్తూ, ఉచిత ఇసుక విధానం ఫెయిలవుతున్న కారణాలను తెలుసుకున్నారు. 

శ్రీసిటికి ఇసుక స్మగ్లింగ్ చేస్తున్న అక్రమాలను గుర్తించి, సీసీ కెమెరాలు, జీపీయస్ ఏర్పాటుతో పాటు రెవెన్యూ, పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి స్మగ్లింగ్ చేస్తున్న వారని అడ్డుకున్నారు. టీడీపీ నేతలు ఇసుక స్మగ్లింగ్ కోసం కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చిన కఠినంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో పాటు ధీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నరైతు భూ సమస్యలపై ఆనంద్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఇది కూడా చదవండి: Pm modi: కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు

Collector Anand: నెల్లూరు జిల్లాలో పోలాలు, స్దలాలకు మార్కెట్ రేటుతో పాటు, ప్రభుత్వ రేటు కూడా భారీగా ఉంటుంది. దీంతో ల్యాండ్ సమస్యలు, లిటిగేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమస్యలు వేలాల్లో వస్తుండటంతో అన్ని రికార్డులు పక్కాగా ఉంటే వాటికి యస్ చెప్పడం, తేడాలు ఉంటే నో అంటూ క్లోజ్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు కలెక్టర్‌ ఫుల్ స్టాప్ పెడుతున్నారంటా.

మహిళలకు దీపం టు పథకం కింద ఉచితంగా మూడు సిలెండర్లు అందేందుకు అవసరమైన అధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్ పుస్తకం సమస్యల పరిష్కారం కొరకు ఆనంద్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి చాలా వరకు సక్సెస్ కాగలిగారు. దీంతో కూటమి నేతలు పాలన పరంగా ఫెయిల్ అవుతున్నా కూడా  ఆ చెడ్డపేరు కూటమి ప్రభుత్వంకు రాకుండా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ చాలా మేలు చేస్తున్నారని టాక్ నడుస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *