jagan

Jagan: జగన్ మాస్టర్ ప్లాన్ అనంత వైసీపీ టాస్క్ ఫోర్స్‌లో తెరమీదకి యువ నాయకుడు

Jagan: ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే… మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో వైసీపీ క్యాడర్ ఆ ఓటమి నుంచి బయటపడడానికి మూడు నెలలకు పైగా సమయం పట్టిందని చెప్పవచ్చు. వాటి నుంచి కోరుకుంటున్న సమయంలో కూటమి ప్రభుత్వం సంచలనం నిర్ణయాలతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠినమైన నిర్ణయాలతో ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని అవసరమైతే పీడియాక్ట్ తీసుకొస్తామని పరోక్షంగా సీఎం చంద్రబాబు హెచ్చరించారు. యాక్టివ్‌గా పని చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెంట్‌గా మారింది.

ఇప్పటికే కొందరు కేసులు ఎదుర్కొంటూ జైలు జీవితం గడుపుతున్నారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో వైసీపీ సోషల్ మీడియా అనే పదం ఉచ్చరించడానికి కూడా బెంబెలెత్తిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ తిరిగి పుంచుకోవాలంటే ఒకే ఒక మార్గం సోషల్ మీడియాలో ప్రశ్నించడం… సమస్యలు ప్రజల వద్దకు తీసుకువెళ్లడం ఒకటే మార్గమని వైసీపీ క్యాడర్ భావిస్తుంది. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాపాడుకోవడానికి సోషల్ మీడియానే బెస్ట్ ఫ్లాట్ ఫామ్ అనుకున్నారేమో తెలియదు గానీ 25 పార్లమెంట్‌లోనూ వైసీపీ సోషల్ మీడియాకి భరోసా ఇచ్చే విధంగా టాస్క్ ఫోర్స్ టీమ్‌ ఎంపిక చేశారు. అందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారు. ఒక్క అనంతపురం జిల్లాలో బీసీ సంఘాల్లో మంచి పట్టు ఉన్న నాయకుడు రమేష్ గౌడ్ అని చెప్పవచ్చు… వైసీపీలో క్రమశిక్షణతో పనిచేసే నాయకుడు కావడంతో అనంతపురం జిల్లాకు సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ లీడర్‌గా జగన్‌ ఎంపిక చేశారు.

ఇది కూడా చదవండి: Maharastra: కౌన్ బ‌నేగా మ‌హారాష్ట్ర సీఎం

Jagan: అనంతపురం జిల్లాలో వైసీపీ సోషల్ మీడియాని బలోపేతం చేసే విధంగా జగన్‌ టాస్క్ ఫోర్స్ పేరుతో ఇద్దరు నాయకులని ఎంపిక చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోని టాస్క్ ఫోర్స్ నాయకుడిగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని ఎంపిక చేశారు. 2019 నుంచి 2024 వరకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ పేరుతోనే సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. ఇప్పుడు అది సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి కేతిరెడ్డి నాయకత్వం వహించుబోతున్నారంటా… కూటమి ప్రభుత్వం నుంచి కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చిన పార్లమెంటు పరిధిలో టాస్క్ ఫోర్స్ ఎంపికైన కేతిరెడ్డి సమన్వయం చేసుకొని కార్యకర్తలకు అండగా నిలవగలరా అనేది ప్రశ్న తలెత్తుతుంది. చూడాలి మరి… రాబోయే కాలంలో కేతిరెడ్డి ఏ విధంగా పోరాటం చేస్తారో.

ALSO READ  Chandrababu: కాకినాడ పోర్ట్ అంశంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

అనంతపురం జిల్లా వైసీపీ టాస్క్ ఫోర్స్  లీడర్‌గా బీసీ రమేష్ గౌడ్‌ను జగన్‌ ఎంపిక చేశారు. బీసీ రమేష్ గౌడ్ వైసీపీలో చేరకముందు రాష్ట్ర బీసీ సంఘ నాయకుడిగా ఎదిగారు. బీసీ విద్యార్థులతో పాటు బీసీ కులాల కోసం పోరాటం చేసిన యువ నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీలో వివాదాలకు దూరంగా ఉంటూ సౌమ్యడిగా 

పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వైసీపీ హయాంలో ఎమ్మెల్సీగా బీసీ రమేష్ గౌడ్‌కి అధిష్టానం హామీ ఇచ్చింది. కానీ పార్టీలో కొన్ని సమీకరణాలు లేదా ఇతర కారణాలో తెలియదు గాని… రమేష్ గౌడ్‌కి ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. పరిశ్రమల ఛైర్మన్ పదవి దక్కుతుందని తన కేడర్ అంతా ఎక్స్పెక్ట్ చేశారు. అక్కడ నిరాశే ఎదురైంది. అయితే రమేష్ గౌడ్‌కి పదవులు రాకపోయిన పార్టీ కోసమే పనిచేసిన వ్యక్తి అని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వాటి పర్యవసానాలు తెలిసి వచ్చాయో తెలీదు గానీ.అనంతపురం జిల్లాలో వైసీపీ పుంచుకోవడానికి జగన్‌ మాస్టర్ ప్లాన్‌తోనే… టాస్క్ ఫోర్స్ పోస్ట్‌కి బీసీ సామాజిక వర్గానికి చెందిన బీసీ రమేష్ గౌడ్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా టీమ్‌కు అండగా నిలవడానికి టాస్క్ ఫోర్స్  పేరుతో ప్రతి పార్లమెంట్‌కి ఒక నాయకుడిని ఎంపిక చేసిన నేపథ్యంలో…. అనంతపురం జిల్లాకు చెందిన టాస్క్ ఫోర్స్ నాయకుడు రమేష్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీని బలోపేతం చేయడానికి కార్యచరణ మొదలు పెట్టారంటా… కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి… 

ఇది కూడా చదవండి: AP News: వైసీపీకి మ‌రో ఎమ్మెల్సీ గుడ్ బై!

Jagan: సమస్యలను ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా సోషల్ మీడియా వింగ్ బలంగా పనిచేసే విధంగా అధినేత జగన్  టాస్క్ ఫోర్స్ లీడర్‌గా రమేష్ గౌడ్‌ని ఎంపిక చేశారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా పోస్టులు ఉండాలి. సోషల్ మీడియా వింగ్‌కు వైసీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇస్తున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి వైసీపీ సోషల్ మీడియా వింగ్ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ జరిగిందంటా.

ALSO READ  Pawan Kalyan: ముగిసిన పవన్,అమిత్ షా భేటీ

2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత క్యాడర్ మనోధైర్యం కోల్పోయిందంట… వైసీపీ పుంజుకొని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చాలా అవసరం… వైసీపీకి నాయకులకు అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ పరిధిలో సోషల్ మీడియా యాక్టివ్‌గా పని చేసే విధంగా టాస్క్ ఫోర్స్ టీమ్ అధినాయకులు ఎంపిక చేశారు. అందులో భాగంగా అనంతపురం పార్లమెంట్ పరిధికి సంబంధించి యువ నాయకుడు బీసీ రమేష్ గౌడ్‌ను ఎంపిక చేశారు. అనంతపురం జిల్లాలో టాస్క్ ఫోర్స్  టీమ్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *