Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. 2 రోజులపాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్ ఉంటారు. ఢిల్లీలో జగరనున్న కేంద్ర హోంశాఖ సమావేశంలో పాల్గొంటారు. అదేవిధంగా వరద నష్టంపై కేంద్రానికి మరోసారి నివేదిక ఇవ్వనున్నారు. రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు సాయం కోరగా, రూ.400 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది. దేనిపై ఢిల్లీలో కేంద్ర మంత్రులకు మరోసారి కేంద్ర సాయం కోసం నివేదిక ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి.

