CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డితో టీపీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ శుక్రవారం (జూన్ 6న) అత్యవసరంగా భేటీ అయ్యారు. 10 రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి చేరుకున్న మీనాక్షి నటరాజన్ ఇక్కడే తిష్ట వేశారు. కాంగ్రెస్ పార్టీలోని వివిధ స్థాయిల నేతలతో ఆమె చర్చిస్తూ వచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై ఆమె క్షుణ్నంగా తెలుసుకున్నారు.
CM Revanth Reddy: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో రేవంత్‌రెడ్డితో మీనాక్షి నటరాజన్ గంటకు పైగా భేటీ అయ్యారు. ఈ భేటీపై అంతటా ఉత్కంఠ నెలకొన్నది. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డి నుంచి మీనాక్షి నటరాజన్ వివరణ కోరినట్టుగా సమాచారం. గత పది రోజులుగా పార్టీ నేతలతో జరిపిన చర్చల విషయమై సీఎంతో చర్చించినట్టు తెలిసింది.